
గ్రేటర్ హైదరాబాద్
అహ్మదాబాద్: గుజరాత్లోని రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలుపొందారు. వీటిలో ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణంతో, మరొకటి భాజపా ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతితో ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ గత ఏడాది నవంబరు, డిసెంబరులలో కొవిడ్ సంబంధిత సమస్యలతో చనిపోయారు. ఈ రెండు స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగిసింది. కాంగ్రెస్ తన అభ్యర్థులను పోటీకి దించకపోవడంతో భాజపా తరఫున నామినేషన్లు సమర్పించిన దినేశ్ చంద్ర అనవదీయ, రామ్భాయ్ మొకారియా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 182 మంది ఎమ్మెల్యేలున్న గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 68 మంది, భాజపాకు 111 మంది సభ్యులున్నారు.