
గ్రేటర్ హైదరాబాద్
గాంధీభవన్, న్యూస్టుడే: మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు మీద నిజంగా అభిమానం ఉంటే ఆయన కుమార్తె వాణీదేవికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వం కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇవ్వాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరాస.. పీవీ కుమార్తె వాణీదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.