
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) పీఠం ఒకటి హైదరాబాద్లోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి(ఎంజీఎన్సీఆర్ఈ)కి మంజూరైంది. ‘ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వర్క్ ఎడ్యుకేషన్’ పీఠం(ఛైర్) ఇక్కడ ఏర్పాటు కానుంది. దీనిలో భాగంగా.. ‘పనిచేస్తూ అనుభవపూర్వకంగా నేర్చుకొనే’ విద్యపై అవగాహన కల్పించి వాటిని పాఠ్య ప్రణాళికలో చేర్చేలా ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులకు శిక్షణ ఇస్తామని ఎంజీఎన్సీఆర్ఈ ఛైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు.