
గ్రేటర్ హైదరాబాద్
ఏపీ పురపాలక ఎన్నికల్లో ప్రత్యర్థులు బలవంతం చేయడంతో తాము నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తగిన ఆధారాలతో ముందుకొచ్చే వారి వివరాలను ఎన్నికల సంఘానికి పంపితే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రమేశ్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు. ఏకగ్రీవాల కోసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న సంఘటనలపైనా మంగళవారంలోగా నివేదికలు పంపాలని ఆదేశించారు. వచ్చే నెల 10న నిర్వహించే పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పుర, నగరపాలక కమిషనర్లతో ఆయన సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు పలు సూచనలు చేశారు.