
గ్రేటర్ హైదరాబాద్
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కాజీపేట టౌన్, న్యూస్‌టుడే: విభజన చట్టంలోని ఆర్టికల్ 13, పదో పాయింట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో సోమవారం ప్రభుత్వ చీఫ్‌విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ కోచ్ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర సాధన తరహాలో మరో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలను నెలకొల్పిందని, తెలంగాణకు కనీసం ఒక్కసారి కూడా రైల్వే మంత్రి అవకాశం కల్పించకపోవడం వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు.