
గ్రేటర్ హైదరాబాద్
మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ప్రతి రెండేళ్లకోసారి ఘనంగా జరుగుతుంది. మహాజాతర తర్వాత ఏడాదికి మండమెలిగే పండగను నిర్వహిస్తుంటారు. అధికారులు, పూజారులు 2007 నుంచి ఈ పండగకు చిన్న జాతరగా నామకరణం చేశారు. ఈసారి చిన్న జాతర ఈనెల 24వ తేదీ నుంచి 27 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరగనుంది. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఇప్పటి నుంచే అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
-ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి