
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: డేట్లు సర్దుబాటుకాని కారణంగా ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ పాత్రపై దర్శకుడు రాజమౌళి కత్తెర వేశారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. డేట్ల సర్దుబాటు విషయంలో కాస్త ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనట. కానీ.. ప్రతిష్ఠాత్మక ‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ చిన్నది ఆలియాభట్ తన డేట్లను మళ్లీ షెడ్యూల్ చేసుకుందట. అంతేకాదు.. చిత్రీకరణలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో ఆమె హైదరాబాద్‌కు రానుందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో కలిసి ఆమె రెండు పాటలకు షూటింగ్లో పాల్గొననుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ అల్లురి సీతారామరాజుగా కనిపించనుండగా.. ఆలియా సీతగా అలరించనుంది. మరోవైపు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. తారక్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ సందడి చేయనుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. అజయ్‌దేవగణ్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.