
సినిమా
హైదరాబాద్: చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునే బొమ్మ ‘టెడ్డీ బేర్’. అలాంటి బొమ్మకు ప్రాణం వస్తే, అది సాహసాలు చేస్తే.. చూడాలనుకుంటున్నారా? అయితే, మార్చి 12వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. తమిళ నటుడు ఆర్య, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టెడ్డీ’. యానిమేటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘టెడ్డీ బేర్’ బొమ్మ కీలక పాత్ర పోషించనుంది. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా మార్చి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘కొచ్చాడియాన్’ తర్వాత భారత్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన చిత్రమిది!