
తాజా వార్తలు
బోణీ కొట్టిన ఆప్
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్ చేసింది. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకు గాను భాజపా 466 చోట్ల విజయం సాధించి సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమైపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మరోవైపు, ఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో సత్తా చాటింది.
6 కార్పొరేషన్లలో ఫలితాలు ఇలా..
* భావ్‌నగర్‌లో 52 డివిజన్లకు గాను భాజపా 44 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది.
*జామ్‌నగర్‌లో 64 స్థానాలకు గాను భాజపా 50 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 11 స్థానాలు, బీఎస్పీ మూడు స్థానాల్లో గెలుపొందాయి.
* 120 స్థానాలు ఉన్న సూరత్‌లో భాజపా 93 స్థానాల్లో దూసుకెళ్లింది. తొలిసారి బరిలోకి దిగిన ఆప్ 27 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ ఇక్కడ ఖాతా తెరవలేక చతికిలపడింది.
* రాజ్‌కోట్‌లో మొత్తం 72 డివిజన్లలో భాజపా 68 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఇంకా నాలుగు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
* వడోదరాలో మొత్తం 76 స్థానాలకు గాను భాజపా 69 స్థానాల్లో విజయ సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైంది.
* అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలు ఉండగా.. భాజపా 161 స్థానాలతో అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాలు గెలుచుకోగా.. ఎంఐఎం ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంకా కొన్ని చోట్ల లెక్కింపు కొనసాగుతోంది.
26న గుజరాత్‌కు కేజ్రీవాల్
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి 27 స్థానాల్లో గెలుపొందడంతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నెల 26న సూరత్‌లో జరగబోయే విజయోత్సవ ర్యాలీకి దిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు.