
తాజా వార్తలు
ముంబయి: విరసం నేత వరవరరావు విడుదలకు మార్గం సుగమమైంది. 2016 నాటి సుర్జాఘర్ మైన్స్‌కు చెందిన వాహనాలను తగులబెట్టిన కేసులో ఆయనకు బాంబే హైకోర్టు నాగ్‌పుర్ బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వరవరరావు అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిసింది. 2016 డిసెంబర్ 25న గడ్చిరోలిలోని ఎటపల్లి తాలూకాలో సూర్జాఘర్ మైన్స్‌కు చెందిన 80 వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఈ కేసులో వరవరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
భీమా కోరేగావ్ కేసులో బాంబే హైకోర్టు ఆయనకు సోమవారం ఆరునెలల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తాజాగా వాహనాలను తగులబెట్టిన కేసులోనూ బెయిల్ వచ్చిన నేపథ్యంలో వరవరరావు విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.