
సినిమా
ప్రిరిలీజ్ వేడుకలో చిత్ర దర్శకనిర్మాతలు
ఇంటర్నెట్ డెస్క్: యువ కథానాయకుడు ఉదయ్‌శంకర్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకత్వం వహించారు. డార్క్ కామెడీ జోనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నం చంద్రమౌళి నిర్మించారు. ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ.. ‘కాళ్లు తడవకుండా సముద్రం దాటిన మేథావి కూడా కళ్లు తడవకుండా సినిమా తీయలేరని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అంటూ ఉంటారు. మాకూ కళ్లు తడిచాయి. కానీ కష్టాలతో కాదు. ఆనందంతో తడిచాయి. కార్తిక్లాంటి డైరెక్టర్, రఘు కుంచెలాంటి సంగీత దర్శకుడు, ఉదయ్లాంటి హీరో, జియాలాంటి హీరోయిన్.. డీఓపీ.. ఇలా అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ముగ్గురు సంగీత దర్శకులు నటించారు. రఘుకుంచె, కోటి, ఇలియాస్ ఈ ముగ్గురూ సంగీత దర్శకులు నటిస్తే.. రోషన్ సంగీతం అందిచారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. ఎవరూ ఊహించని సస్పెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ థ్రిల్‌కు గురవుతారు’ అని ఆయన ముగించారు. దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ.. ‘ఈ కథను ఎంచుకున్నందుకు వర్లుగారికి కృతజ్ఞతలు. ఇలాంటి స్క్రిప్టుతో సినిమా చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం’ అని అన్నారు.