close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంటి పేరుమారింది!

హిళలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా... ఇప్పటికీ చాలా ఇళ్లముందు మగవారి పేర్లే నేమ్‌ప్లేట్‌లపై కనిపిస్తుంటాయి. ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా...ఎన్ని అవకాశాలు ఇస్తున్నా ఇంకా చాలా చోట్ల ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి ఓ వినూత్నమైన ఆలోచనతో చెక్‌ పెట్టాలనుకుంది మధ్యప్రదేశ్‌లోని షాజాపుర్‌ జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం. ఇందులో భాగంగా ఆ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన సుమారు వెయ్యి ఇళ్ల ముందు లబ్ధిదారుల కుటుంబంలోని ఆడపిల్లల పేరుతో నామఫలకాలను ఏర్పాటు చేసింది. ఇలా చేయడం దేశంలోనే మొదటి సారి కూడా అంటారు అక్కడి పంచాయతీ రాజ్‌ విభాగం సీఈవో మిషా సింగ్‌. ఆమే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు.‘ మా లక్ష్యం నాలుగువేల ఇళ్లు. ఇక్కడ కేవలం నామఫలకాలు ఏర్పాటు చేయడంతోనే మా పని అయిపోదు. ఇప్పటి నుంచే అసలైన పని  మొదలవుతుంది. బాలికావిద్య, మహిళల ఆరోగ్యం, స్త్రీలు ఆర్థిక సాధికారత సాధించడానికీ, అమ్మాయిల ప్రాధాన్యం నొక్కి చెప్పడానికి మేం వేస్తోన్న మొదటి అడుగు ఇది’ అంటారామె.


మరిన్ని