close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గొంతెత్తారు!

రాళ్లు పడతాయని తెలిసినా వారు ధైర్యంగా మాట్లాడతారు. మిగిలినవాళ్లు మనకెందుకులే అనుకునే సున్నిత విషయాల మీదా స్పందిస్తారు.. తమదైన ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు.

‘‘మన హక్కులు మనకెవరూ పళ్లెంలో పెట్టివ్వరు. వాటికోసం పోరాడాల్సిందే’’
‘‘మా అమ్మ మధ్యతరగతి విలువల మధ్య పెరిగింది. పెళ్లయ్యాక భర్త ఇంటిపేరును స్వీకరించింది. కానీ తనకు న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని నాన్న దగ్గర విడిచిపెట్టి వెళ్లింది.’’ అనే నటి స్వరాభాస్కర్‌ మహిళలకు ధైర్యం, నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ ముఖ్యమంటారు. ఈమె దిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని.

‘‘చైతన్యవంతులైన మహిళలంటే భారతీయ మగవాళ్లకు భయం’’

‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన తాప్సీ.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొద్దికాలం పనిచేశారు. మోడలింగ్‌ చేసే రోజుల్లో దిల్లీ సిటీబస్సులో ఈవ్‌ టీజింగ్‌కు గురైన ఈమె.. ఆడపిల్లల సమస్యలు, సామాజిక అంశాల మీద నిత్యం గళమెత్తుతుంటారు.


మరిన్ని