close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రంగు పడకుండా!

నెరిసిన జుట్టుకు రంగు వేసుకోవడం... ట్రెండీగా ఉండేందుకు కొత్త వర్ణాలద్ద్దుకోవడం... ఇలా ఇప్పుడు హెయిర్‌ డై వాడటం సర్వసాధారణమైంది. అయితే దీన్ని వేసుకునే క్రమంలో చర్మంపై మరకలు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
జుట్టుకు రంగు వేసుకునేవారు ముందుగా మెడ, చెవులు, భుజాలు, చేతులకు పెట్రోలియం జెల్లీ/ఆలివ్‌ నూనెను చర్మంలో ఇంకేలా రాసుకోవాలి. ఆ తర్వాత జుట్టుకు డై వేసుకుంటే ఒకవేళ పొరపాటున రంగు చర్మంపై పడినా... తుడిస్తే వెంటనే పోతుంది.
హెయిర్‌ క్లిప్స్‌... డై వేసుకున్నాక కొన్నిసార్లు అది వెంట్రుకల నుంచి కారి చర్మంపై పడొచ్చు. కాబట్టి డై వేసుకోగానే జుట్టును ముడిలా వేసి క్లిప్‌తో పైకి పెట్టుకోవాలి. మెడ చుట్టూ టవల్‌ని చుట్టుకుంటే రంగు పడకుండా ఉంటుంది. రంగు వేసుకునే సమయంలో అది చుక్కలుగా ముఖం, మెడ మీద పడుతుంటే వెంటనే టిష్యూతో తుడుచుకుంటే సరి.


మరిన్ని