close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆరోగ్యాన్నిచ్చే టీ!

మనలో చాలామందికి టీ తాగితేనే కానీ రోజు మొదలవదు. అయితే ఎప్పుడూ ఒకేరకం తాగితే ఏముంటుంది చెప్పండి. కాబట్టి కొన్ని ప్రత్యేక రకాలను ప్రయత్నించి చూడండి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవేంటో వాటి తయారీ, వాటి వల్ల కలిగే లాభాలూ తెలుసుకుందామా..



అల్లం చాయ్‌...
తయారీ... లీటరు నీటిలో చెంచా అల్లం ముక్కలను వేసి పదినిమిషాలపాటు పెద్ద మంటపై బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి.. రెండు చెంచాల తేనె, సగం ముక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే వేడి వేడి రుచికరమైన టీ రెడీ.  
లాభాలు... ఈ చాయ్‌లోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకతను పెంచి మనల్ని దృఢంగా మారుస్తాయి. అలాగే  దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. జలుబు, దగ్గు లాంటివి తగ్గుముఖం పడతాయి.


తులసి..
రెండు కప్పుల నీటిని బాగా మరిగించి అందులో గుప్పెడు తులసి ఆకులను వేయాలి. ఇప్పుడు మరో ఐదు నిమిషాలపాటు మరిగించాలి. ఈ ద్రవాన్ని కప్పులోకి వడకట్టుకుని చెంచా తేనె కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రిస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా. జలుబును దూరం చేస్తుంది.



జీలకర్ర...
గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం పూట చిన్న మంటపై బాగా మరిగించి  వడబోసి తాగితే సరి. కావాలనుకుంటే చెంచా తేనె, నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు.ఈ టీ తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక కొవ్వు తగ్గుతుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు నాడీ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి.



మరిన్ని