close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిటికెలో తయారయ్యే జ్యూస్‌లు...

ఈ కాలంలో చల్లచల్లని జ్యూస్‌లు తాగితే భలే ఉంటుంది కదా... వాటిలో తగినన్ని పోషకాలూ ఉంటే ఆరోగ్యానికీ మంచిది. ఇవన్నీ అలాంటివే. అంతేకాదు చిటికెలో తయారవుతాయి కూడా.
ద్రాక్షరసం: పావుకేజీ ద్రాక్ష పండ్లను రెండు, మూడుసార్లు బాగా కడగాలి. వీటిలో రెండు టేబుల్‌స్పూన్ల తేనె, చిటికెడు మిరియాలపొడి, కొద్దిగా ఉప్పు వేసి జ్యూసర్‌లో రసం తీయండి. ఈ రసాన్ని వడకట్టి ఐస్‌క్యూబ్స్‌ వేసుకుంటే తియ్యని ద్రాక్ష జ్యూస్‌ రెడీ.

పుచ్చకాయ జ్యూస్‌: దీన్ని చిన్న ముక్కల్లా కోసుకోవాలి. గింజలు తీసేయాలి. ఈ ముక్కల్లో నాలుగు చెంచాల పంచదార వేసి, అరచెక్క నిమ్మరసం పిండాలి. వీటిని జ్యూసర్‌లో వేసి రసం తీసుకోవాలి. ఇష్టమైతే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు లేదా చల్లని నీళ్లు కలిపి తాగేయొచ్చు.

తర్బూజాతో: ఈ పండును చిన్న ముక్కల్లా కోసుకోవాలి. దీంట్లో రెండు చెంచాల పంచదార వేయాలి. దీనికి బదులుగా కాస్త తేనె కూడా కలపొచ్చు. ఈ ముక్కలను జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. ఇష్టమైతే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు.


మరిన్ని