close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ ప్యాక్‌లతో నలుపు మాయం!

ఈకాలంలో ఎండలకు చర్మం కందిపోతుంది. ముఖం, మెడ మీద నలుపు పెరిగిపోతుంటుంది. అలాంటప్పుడు ఎలాంటి రసాయనాలులేని సహజసిద్ధమైన ఈ ప్యాక్‌లను ప్రయత్నించొచ్చు.

కలబంద, తేనె, పసుపుతో: రెండు చెంచాల కలబంద గుజ్జులో చెంచా తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. మూడు, నాలుగు రోజులకోసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
టొమాటో ప్యాక్‌: బాగా పండిన టొమాటోను మిక్సీ జార్‌లో వేసి పేస్టు చేయాలి. ఈ గుజ్జులో చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాస్తున్నప్పుడే.. సవ్య, అపసవ్య దిశల్లో సున్నితంగా మర్దనా చేయాలి. బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత మీ చర్మ తత్వానికి సరిపోయే మాయిశ్చరైజర్‌ను  రాయాలి. వారానికి రెండు, మూడుసార్లు ఈ ప్యాక్‌ వేస్తే నలుపు తగ్గుతుంది.


మరిన్ని