close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మల్లెలు విరబూయాలంటే...

మా ఇంటి వెనుక కాస్త స్థలం ఉంది. దాంట్లో రెండేళ్ల క్రితం మూడు మల్లె మొక్కల్ని తెచ్చి నాటాను. మొదటి ఏడాది బాగానే పూశాయి. కానీ తర్వాత నుంచి నిండుగా ఆకులు ఉంటున్నాయి తప్ప పూలు రావడం లేదు. ఇందుకోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

- రాధ, కాకినాడ

వేసవిలో మల్లెపూలు విరివిగా పూస్తాయి. కానీ మీరు పెంచిన మొక్కలు పూలు పూయడం లేదంటున్నారు.   బహుశా... వాటికి సరైన సంరక్షణ అందివ్వలేదనిపిస్తోంది. మల్లె మొక్కల్ని ఒకసారి నాటితే పది పన్నెండేళ్ల పాటు బతుకుతాయి. సారవంతంగా ఉండే అన్నిరకాల నేలల్లోనూ ఇవి చక్కగా ఎదుగుతాయి. అయితే ఆ మట్టిలో నీరు నిల్వ ఉండకూడా చూసుకోవాలి. అలాగని మట్టినీ పొడిబారనివ్వకూడదు. వేసవి రాక ముందే ముదురు ఆకుల్ని దూసేయాలి. మొక్క చుట్టూ ఉండే మట్టిని తీసేసి పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టుని వేయాలి.
సాధారణంగా మొగ్గలు లేత చిగురుల నుంచి వస్తాయి. కాబట్టి...ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలు, ముదురు ఆకుల్ని కత్తిరించుకోవాలి. అయితే వీటిని దూశాక మొక్కకు ఇరవై రోజుల తర్వాతే నీటినీ, ఎరువులనూ అందించాలి. మొగ్గలు తగ్గితే మరోసారి ప్రూనింగ్‌ చేయాలి. పూలు పూసే సమయంలో పొటాషియం ఎక్కువగా ఉండే ద్రవరూప ఎరువుని అందిస్తే ఎక్కువ మొగ్గలు రావడమే కాదు...పెద్దగానూ పూస్తాయి.


మరిన్ని