close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పిల్లల్ని ఇలా రక్షించుకుందాం

కరోనా పిల్లలూ పెద్దలూ అని తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. కాబట్టి చిన్నారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే! అందుకేం చేయాలో తెలుసుకుందాం రండి.

పిల్లలకి పాఠశాలలు లేవు, అంతా ఆన్‌లైన్‌ క్లాసులే! కాబట్టి భద్రంగానే ఉన్నారు అనుకుంటారు అమ్మానాన్న. కానీ వాళ్లు ఇంట్లోనే సెల్‌ఫోన్‌ చూసుకుంటూ వీడియో గేమ్స్‌లో మునిగిపోతున్నారు. అది పట్టించుకోకపోతే ప్రమాదమే! ఎందుకంటే మొబైల్‌ నుంచి వచ్చే నీలికాంతి పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనాని ఎదిరించేందుకు దీని అవసరం చాలా ఉంది కదా! అందుకే ఎక్కువగా వాళ్ల చేతికి ఫోన్‌ ఇవ్వకండి.
బయటి నుంచి తెచ్చే పండ్లని, చిరుతిళ్లని శుభ్రం చేయకుండా ముట్టుకోవద్దని చెప్పాలి. ఇంట్లో ఉన్నా సరే పిల్లలకి మాస్క్‌లు వేసి ఉంచండి. తినబోయేముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కున్నారో లేదో గమనించండి.
ఇమ్యూనిటీని పెంచే నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి మొదలైన పండ్లను పిల్లలు తినేలా చూడాలి. వీటితో పాటు విటమిన్లు, ఖనిజాలు..ఇతర పోషకాలుండే... పెరుగు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరల వంటివన్నీ చిన్నారులు తీసుకునేలా చూడాలి.
రోజుకి 8 నుంచి 10 గంటలు తప్పక నిద్రపోయేలా చూడండి. నిద్రలేమి వ్యాధినిరోధకశక్తి మీద ప్రభావం చూపుతుంది. వీటన్నింటితో పాటు తగినంత వ్యాయామమూ అవసరమే.


మరిన్ని