close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ వివాదంలోకి మమ్మల్ని లాగకండి

ప్రభుత్వానికి దేవరయాంజల్‌ రైతుల విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంలో తమను ఇరికించవద్దని దేవరయాంజల్‌ రైతు సమాఖ్య ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కీసర ఆర్డీఓ రవిని కలిసి వినతిపత్రం అందించారు. ఈటల ఏవైనా అవకతవలకు పాల్పడి ఉంటే విచారణ చేసి నిగ్గు తేల్చాలని, అంతేతప్ప గ్రామంలోని వందలాది ఎకరాలకు లంకె పెట్టి రైతులకు నష్టం కలిగించొద్దని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, అన్ని పత్రాలు, హక్కులు ఉన్న తమను ఈ వివాదంలోకి లాగొద్దని కోరారు. తమపై కబ్జాదారుల ముద్ర వేసి భయభ్రాంతుల్ని చేయడం సమంజసం కాదన్నారు. తమ వద్ద ఉన్న పత్రాలతో ఐఏఎస్‌ల కమిటీ ఎదుట హాజరుకావడానికి సిద్ధమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నియమించిన భూ పరిపాలనాశాఖ (సీసీఎల్‌ఏ) క్రమబద్ధీకరణ వంటి ఐచ్ఛికాలను సూచించిందని గుర్తు చేశారు. టైటిల్‌ వివాదం పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తాము కోరుతున్నామని, ఇప్పటికైనా తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తిచేశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.