close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వాయువు కొరత ఆయువు తీసింది

కర్ణాటకలో ఒక్కరోజే 24 మంది మృతి
చామరాజనగరలో ఘోరం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక ఒక్కరోజే 24 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల మధ్యలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. జిల్లా ఆసుపత్రిలో 23 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో మరొకరు అసువులు బాశారు. శుక్రవారం నుంచి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని వైద్యులు చెబుతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ జిల్లాకు కనీసం 280 జంబో సిలిండర్లు కావాలని ప్రతిపాదనలు పంపినా అవి రాలేదు. పొరుగు జిల్లా మైసూరు నుంచి చామరాజనగరకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారానికి 60 సిలిండర్లు కావాలని చెప్పినా.. 30 సిలిండర్లే వచ్చాయని జిల్లా ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ సంజీవ్‌రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనిచేయకపోవటం, మైసూరు జిల్లా నుంచి సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవటంతో రోగులు ఇబ్బంది పడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా ఆక్సిజన్‌ నిండుకోవడంతో మరణ మృదంగం మోగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణ దర్యాప్తు కోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శివయోగి కళసద్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన అనంతరం ఆక్సిజన్‌ సరఫరాదారులతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహించారు. సరఫరా సమయాన్ని తగ్గించేందుకు అవసరమైతే గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుచేస్తామని, ఎల్పీజీ ట్యాంకర్‌ డ్రైవర్లతో ఆక్సిజన్‌ ట్యాంకర్లు నడిపిస్తామని అన్నారు.

అలా మరణించింది ముగ్గురే: ఆరోగ్య మంత్రి
అయితే.. గడచిన 24 గంటల్లో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేక మరణించింది ముగ్గురేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ అన్నారు. దేశమంతా ఎక్కడా వందశాతం ఆక్సిజన్‌ అందించే వ్యవస్థ లేదని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. 14 మది ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 12 మధ్యలో మరణించారని, వారి పరిస్థితి విషమించి సహజంగానే మరణహంచారని అన్నారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ముగ్గురే మరణించారని, వారికే ఆక్సిజన్‌ కొరత ఉందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మైసూరు జిల్లాలో ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉన్నందునే పొరుగు జిల్లాకు సరఫరా చేయలేదని చామరాజనగర జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సురేశ్‌కుమార్‌ అన్నారు. మరణాలన్నింటికీ ఆక్సిజన్‌ కొరతే కారణమనడం సరికాదని ఆయన చెప్పారు.

చనిపోయారా.. చంపేశారా: రాహుల్‌
‘వాళ్లు చనిపోయారా.. లేక చంపేశారా? మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వ్యవస్థ కళ్లు తెరిచేలోపు ఇంకెన్ని బాధలు అనుభవించాలి’ అని కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలన సరిగా చేయలేకపోతున్నారని కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ మండిపడ్డారు. మరణాలపై న్యాయవిచారణకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిమాండుచేశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.