close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈటల వ్యవహారంలో ఐఏఎస్‌లతో కమిటీ

దేవాలయ భూముల ఆక్రమణలపై దర్యాప్తు
ఏసీబీ, విజిలెన్స్‌ విచారణలు కూడా

ఈనాడు హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల వ్వ్యవహారంలో మరో పరిణామం.. దేవాదాయ భూముల ఆక్రమణలపై మరో ఉన్నతస్థాయి విచారణతోపాటు ఇదే అంశంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్‌ దర్యాప్తునకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజల్‌ గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి నలుగురు ఐ.ఎ.ఎస్‌. అధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ విచారణకు మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ దేవాలయానికి 1,521 ఎకరాల 13 గుంటల భూమి ఉందని దేవాదాయ శాఖ చెబుతోందని, ఇందులో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ భూ బదలాయింపులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఎసైన్డ్‌ భూములను ఈటల, ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై ముఖ్యమంత్రి విచారణ జరిపించడం, ఆక్రమణలు వాస్తవమేనని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నిర్ధారించడం, మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్‌ చేయడం తెలిసిందే. దేవరయాంజల్‌లోని దేవాదాయ భూములపై సోమవారం విచారణకు ఆదేశించారు.

కేసులు.. అరెస్టులకు భయపడను: ఈటల
‘అధికారం ఉందని ఏదంటే అది చేస్తే ప్రజలు హర్షించరు. కేసులు.. అరెస్టులకు భయపడే చిన్నవాడు కాదు ఈటల. చావునైనా భరిస్తాగానీ.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకునేది లేదు’ అని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. జైలుకైనా వెళ్తానుగాని లొంగేది లేదన్నారు. భూముల వ్యవహారంపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని, ఎమ్మెల్యేగా రాజీనామాపై నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అనంతరం సోమవారం ఈటల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘వేల ఎకరాల భూముల్ని కబ్జా పెట్టానని, ఎసైన్డ్‌, దేవాలయ భూములు ఆక్రమించిండని, పెద్ద కుంభకోణాలు చేసిండని తెలంగాణ ప్రజలు అసహ్యించుకునేలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్‌.. ఈటల రాజేందర్‌ అనే మామూలు మనిషి మీద తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ల్యాండ్‌, ఏసీబీ, ఫారెస్టు.. అధికారులను పంపి.. వారే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిపించుకొని.. ఎసైన్డ్‌ ల్యాండ్‌ భూములట కదా.. ఆక్రమించుకున్న భూములట కదా అని చర్చోపచర్చలు పెట్టి ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టటమనేది ఆయన గౌరవాన్ని, స్థాయిని పెంచదు. తెలంగాణ ప్రజల్ని మెప్పించదు’ అని ఈటల మండిపడ్డారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.