close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రాణభయంతోనే రీకౌంటింగ్‌కు ఆదేశించలేదు: Didi

ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఆర్‌వో భయపడ్డారు
నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపుపై దీదీ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: నందిగ్రామ్‌ ఫలితంపై త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. ప్రాణభయం వల్లే ఆ నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) రీకౌంటింగ్‌కు ఆదేశాలివ్వలేదని పేర్కొన్నారు. రీకౌంటింగ్‌ నిర్వహించాలని ఆదేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితీ తలెత్తుతుందని ఆర్‌వో తీవ్ర భయాందోళనకు గురైనట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయానికి చెందిన ఓ అధికారికి ఆర్‌వో పంపిన సందేశంగా పేర్కొంటూ ఓ ఎస్‌ఎంఎస్‌ను ఆమె బహిర్గతం చేశారు.

‘‘నందిగ్రామ్‌ ఫలితాలను ఒకసారి అధికారికంగా ప్రకటించాక మళ్లీ వాటిని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఎందుకు మార్చాల్సి వచ్చింది? అక్కడ నాలుగు గంటల పాటు సర్వర్‌ డౌన్‌ ఉందని చెప్పారు. అలా ఎందుకు జరిగింది. ఈ పరిణామాలపై మేం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని సోమవారం విలేకర్ల సమావేశంలో దీదీ పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో తృణమూల్‌ కార్యకర్తలపై భాజపా దాడులకు దిగిందని ఆమె ఆరోపించారు. కమలనాథులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలంటూ తమ పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

విపక్షాలు ఉమ్మడిగా పోరాడొచ్చు
బెంగాల్‌లో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని మమత మరోసారి ఆరోపించారు. ఈసీ సాయపడకపోయి ఉంటే రాష్ట్రంలో భాజపా 50 సీట్ల మార్కును కూడా దాటకపోయి ఉండేదని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను పోషించాల్సిన పాత్ర గురించి.. కొవిడ్‌ సంక్షోభం ముగిశాక ఆలోచిస్తానని చెప్పారు. సమష్ఠిగా నిర్ణయం తీసుకుంటే.. భాజపాపై విపక్షాలు ఉమ్మడిపై పోరాడవచ్చునని పేర్కొన్నారు. మరోవైపు- భాజపాకు కోల్పోయిన ఓట్లను తిరిగి రాబట్టుకోవడంలో వామపక్షాలు విఫలమయ్యాయని దీదీ పేర్కొన్నారు. ‘‘వామపక్షాలతో నాకు రాజకీయపరమైన విభేదాలున్నాయి. కానీ, వారికి ఒక్క స్థానం కూడా రావొద్దని నేను కోరుకోలేదు. భాజపాకు కోల్పోయిన ఓటుబ్యాంకును కామ్రేడ్లు తిరిగి సంపాదించుకోగలిగి ఉంటే బాగుండేది’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తనకు సంప్రదాయపూర్వక ఫోన్‌కాల్‌ ఏదీ రాలేదని మమత చెప్పారు. నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి చేతిలో దీదీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి గమనార్హం.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.