మయన్మార్‌లో సైనిక హెలికాప్టర్‌ కూల్చివేత!
close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మయన్మార్‌లో సైనిక హెలికాప్టర్‌ కూల్చివేత!

కొనసాగుతున్న ఉద్రిక్తతలు

బ్యాంకాక్‌: సైన్యం, తిరుగుబాటు దళాల మధ్య పోరుతో మయన్మార్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ను సోమవారం తాము కూల్చివేసినట్లు ‘కాచిన్‌ స్వాతంత్య్ర సైన్యం’ అనే గెరిల్లా దళం ప్రకటించింది. మొమౌక్‌ పట్టణంలో పలు హెలికాప్టర్లు, జెట్‌ యుద్ధ విమానాలతో మిలటరీ తమపై దాడికి ప్రయత్నించిందని తెలిపింది. తమ బలగాలు దీటుగా స్పందించి ఓ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు వెల్లడించింది. మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని సైన్యం కూలదోయడంపై చాన్నాళ్లుగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు తిరుగుబాటు దళాలు సైన్యంపై సాయుధ పోరాటం సాగిస్తున్నాయి.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo