close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫలించిన ముందస్తు వ్యూహం

తెరాసకే మేయర్లు, ఛైర్‌పర్సన్‌ పీఠాలు
ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థుల ఖరారు!

ఈనాడు, హైదరాబాద్‌: మినీ పురపోరులో తెలంగాణ రాష్ట్రసమితి విజయఢంకా మోగించింది. రెండు కార్పొరేషన్లు, అయిదు పురపాలికలను చేజిక్కించుకుంది. ఇటీవల రెండు పట్టభద్ర స్థానాలతో పాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ పురపోరులోనూ అదే జోరును ప్రదర్శించింది. మొత్తం ఏడింటిలో ఆరుచోట్ల తెరాస సిట్టింగు స్థానాలను నిలబెట్టుకుంది. కొత్తగా పురపాలక సంఘంగా ఏర్పడిన కొత్తూరులో తెరాస బోణీ చేసింది. సీఎం కేసీఆర్‌ పురపోరు సందర్భంగా ఎన్నికలకు ఇన్‌ఛార్జిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఆయా జిల్లాల మంత్రులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డిలకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, రాజయ్య, గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, అంజయ్య యాదవ్‌లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ వరంగల్‌, ఖమ్మంలలో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అచ్చంపేట, జడ్చర్లలోనూ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేదు. సీఎం వ్యూహానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు పనిచేశాయి. స్థానిక అభివృద్ధికి తోడు జిల్లా, రాష్ట్రస్థాయి అభివృద్ధిని ప్రచారాస్త్రాలుగా తెరాస ఉపయోగించుకుంది. మరోసారి సిద్దిపేట తెరాస కంచుకోటగా నిలిచింది. మంత్రి హరీశ్‌రావు పకడ్బందీ ప్రణాళికతో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రచారంలోనూ అన్నీ తానై నిలిచారు. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్‌ అభ్యర్థులను ఒకటి, రెండురోజుల్లో సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. ఇప్పటికే వరంగల్‌లో మాజీ ఎంపీ గుండు సుధారాణి అధిష్ఠానం ఆదేశంతో కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆమెకు మేయర్‌ పదవి దక్కే అవకాశం ఉంది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ అభిప్రాయం మేరకు మేయర్‌ను తెరాస అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. మిగిలిన అయిదుచోట్ల పురపాలక ఛైర్‌పర్సన్లను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఖరారు చేస్తారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.