close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కదలని రేషన్‌ బండి

ఉచిత బియ్యం పంపిణీకి అవాంతరాలు
మూడు రోజులకు 12% పూర్తికాని వైనం

ఈనాడు, అమరావతి: ఇంటింటికి రేషన్‌ పంపిణీపై ఓ వైపు మొబైల్‌ వాహన ఆపరేటర్లు, మరోవైపు డీలర్లు అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో మూడు రోజులు గడిచినప్పటికీ ఈనెల రేషన్‌ పంపిణీ 12% కూడా పూర్తికాలేదు. రెండు రేషన్లు పంపిణీ చేస్తున్నామని, తమకిచ్చే మొత్తాన్ని కూడా రెట్టింపు చేయాలంటూ మొబైల్‌ వాహన ఆపరేటర్లు పట్టుబడుతున్నారు. తమకిచ్చిన లాగిన్‌ తీసేసి వీఆర్వో, ఎండీయూ లాగిన్‌తో పంచమంటే ఎలాగని డీలర్లు భీష్మిస్తున్నారు. తమ డిమాండ్లతో సోమవారం మొబైల్‌ వాహనాల ఆపరేటర్లు పలుచోట్ల వాహనాలను నిలిపేశారు. కొందరు వాహనాలను ఒకే చోట ఉంచి అందిస్తున్నారు. కరోనా భయంతో కొంతమంది విధులకు దూరంగా ఉంటున్నారు. తమవల్ల కావంటూ ఇప్పటికే పలువురు వాహనాలను ప్రభుత్వానికి అప్పగించారు.
 రాష్ట్రంలో పరిస్థితి ఇలా...
శ్రీకాకుళం జిల్లాలో 522 వాహనాలుండగా 250 వరకు పంపిణీకి రాలేదు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో పది వాహనాలకు నాలుగే నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో తొమ్మిదింటికి మూడు నడుస్తున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో 11 వాహనాలకు ముగ్గురు రాజీనామా చేయగా, ఇద్దరికి కొవిడ్‌ కారణంగా పంపిణీ నిలిచింది. ఫిరంగిపురం, తాడికొండ మండలాల్లో ఇద్దరేసి చొప్పున రాజీనామా చేశారు. తుళ్లూరు మండలంలో కొవిడ్‌ పాజిటివ్‌తో రెండు వాహనాల పరిధిలో పంపిణీ ఆగింది. కడపలో 51 వాహనాల ద్వారా పంచాల్సి ఉండగా 19 మంది వైదొలిగారు.
 ఎండీయూల ఆందోళన
ఇంటింటికి రేషన్‌లో భాగంగా ప్రభుత్వం మొబైల్‌ వాహనాలను ఇచ్చి అద్దె, డీజిల్‌, సహాయకుడి జీతం ఖర్చుల కింద నెలకు రూ.21 వేల చొప్పున ఇస్తోంది. ఈ నెలలో కరోనా నేపథ్యంలో ఉచితంగా రెండు రేషన్లు కలిపి పంచుతున్నందున తమకిచ్చే మొత్తాన్ని రెట్టింపు చేయాలని ఎండీయూలు విన్నవిస్తున్నారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళంలో కలెక్టరేట్లకు వచ్చి జేసీకి విన్నవించారు. సహాయకుడికి ఇచ్చే రూ.5వేలు చాలడం లేదని వాపోతున్నారు.
వీఆర్వో లాగిన్‌.. పంపిణీ చేసేది డీలర్‌
గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 16 విడతల ఉచిత రేషన్‌ పంపిణీ బాధ్యతలను రేషన్‌ డీలర్లే నిర్వహించారు. ప్రస్తుతం మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ జరగని ప్రాంతాల్లో వీరి ద్వారానే వీఆర్వో లాగిన్‌పై సరకులను ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనాతో రేషన్‌ డీలర్లు, వారి కుటుంబీకులు 52 మంది మరణించారని, బాధితులకు ఎలాంటి సాయం అందలేదని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు తెలిపారు. ఈనెల 10లోపు డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించకపోతే 11న ఒక రోజు రేషన్‌ పంపిణీ నిలిపేస్తామని హెచ్చరించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.