Eatala: ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఏదైనా చేస్తారు
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Eatala: ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఏదైనా చేస్తారు

ఉప ఎన్నికలు జరిగేచోట వరాల జల్లు కురిపించడం అలవాటే
 మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, ఇల్లందకుంట, న్యూస్‌టుడే: ‘‘ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదైనా చేస్తడు. నాలాంటోడు మాట్లాడితేనే ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మొన్న నేను అడిగిన కాబట్టే రేషన్‌ కార్డులిస్తానంటున్నడు.ఆ కార్డులే కాదు..2018 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు నిరుద్యోగులందరికీ రూ.మూడువేల భృతి ఇవ్వాలి. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నవాళ్లకి కొత్త పింఛన్లు కూడా ఇవ్వాలి’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించే అలవాటు సీఎంకు ఉంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనూ పెండింగ్‌ పనులన్నింటికీ డబ్బులు, జీవోలు ఇవ్వాలని కోరుతున్న. గతంలో వావిలాల, చల్లూరు మండలాలు కావాలని కోరిన. అవసరమైతే హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని కోరిన. అవన్నీ నెరవేర్చాలి. రాష్ట్ర వ్యాప్తంగా నాకోసం ఇంటికొక మనిషి వస్తడు. 2018లో ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించే ప్రయత్నం చేసిండ్రు. అయినా భరించిన. నా సహనాన్ని గొప్పతనంగా భావిస్తున్న. నేను ఎవరికీ భయపడను’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై ఈటల స్పందిస్తూ.. నిజంగా ఆయనకు ఆత్మగౌరవం, రోషం ఉందా అని వ్యాఖ్యానించారు. భావ దారిద్య్రం ఆయనదా, నాదా అనేది ఆయన్నే అడగాలన్నారు.



మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo