రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఎందుకు పడిపోయింది?
close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఎందుకు పడిపోయింది?

పరిశ్రమల శాఖ మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలు
తెదేపా నేత యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో అంతా బాగుంటే పారిశ్రామిక వృద్ధి రేటు -3.26 శాతానికి ఎందుకు పడిపోయిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 1.58 శాతం నమోదైనట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. 2011-12లో స్థిరీకరించిన ధరల ప్రకారం.. జీఎస్‌డీపీ రేటు -2.58గా నమోదైందని, దేశవ్యాప్తంగా జీఎస్‌డీపీకి ఈ లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలిపారు. సేవల రంగం వృద్ధి -6.71 శాతానికి పడిపోయిందన్నారు. రెండేళ్లలో ఏపీ నుంచి రూ.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని మండిపడ్డారు. రెండేళ్లలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదని, ఒక్కరికీ ఉపాధి కల్పించలేదని ఆరోపించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై మంత్రి గౌతమ్‌రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. రెండేళ్ల పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

ప్రకటనలో యనమల ప్రస్తావించిన అంశాలు...
* తెదేపా హయాంలో పారిశ్రామిక సదస్సుల ద్వారా రూ.15.45 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తే ఇప్పుడవన్నీ ఏమైపోయాయి?
* కియా అనుబంధ పరిశ్రమలు, లులూ గ్రూపు, ఆసియా పేపర్‌ మిల్‌, అదానీ డేటా సెంటర్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి.
* రాష్ట్రంలో మూడు కారిడార్ల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే... వైకాపా ప్రభుత్వం ఆయా కారిడార్లలో కనీసం భూ సేకరణకు సరిపడా నిధులు కేటాయించడం లేదు. భూ సేకరణకు రూ.50 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.
* మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి.. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ.250 కోట్లే కేటాయించారు.  
* మత్స్యకారుల పేరుతో షిప్పింగ్‌ యార్డులను బినామీలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెజ్‌లను అనుయాయులకు అప్పగించుకున్నారు.
* రాష్ట్రంలో లక్షకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుంటే 12 వేల పరిశ్రమలకే రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద రూ.905 కోట్లు ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు గతంలో కేటాయించిన భూములకు రెట్టింపు ధరలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో వారంతా పారిపోతున్నారు. కొన్నిచోట్ల ఎంఎస్‌ఎంఈ భూములను ఇళ్ల స్థలాల కోసం లాక్కున్నారు.
* రూ.5 వేల కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉండగా.. రెండేళ్లలో ఒక్క రూపాయీ ఇవ్వలేదు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo