close

ఆంధ్రప్రదేశ్

భాగవతుల వెంకట పరమేశ్వరరావు కన్నుమూత

ప్రముఖుల సంతాపం

ఈనాడు డిజిటల్‌- అమరావతి, తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: ప్రముఖ సంఘ సేవకులు,  శాస్త్రవేత్త, గాంధేయవాది, భాగవతుల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (బి.సి.టి.) వ్యవస్థాపకులు డాక్టర్‌ భాగవతుల వెంకట పరమేశ్వరరావు(86) కన్నుమూశారు. విశాఖనగరంలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ గ్రామ సేవపై మక్కువతో స్వగ్రామం విశాఖ జిల్లా దిమిలికి వచ్చేశారు. 1976లో భాగవతుల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, మహిళల ఆర్థిక స్వావలంబనకు విశేష కృషిచేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆయనను సత్కరించాయి. వెంకట పరమేశ్వరరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం సంతాపం తెలిపారు. బీసీటీ ద్వారా భాగవతుల వెంకట పరమేశ్వరరావు అందించిన సేవలు ఆదర్శనీయమని జగన్‌ పేర్కొన్నారు. మాతృభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో తన భవిష్యత్తును తృణపాయంగా వదిలిన వ్యక్తి పరమేశ్వరరావు.. అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు