close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యం!

కొందరు మహిళల్ని జననాంగాల ఇన్‌ఫెక్షన్లు ఇబ్బందిపెడతాయి. వాటిని తగ్గించేందుకు వైద్యులు మందులు సూచించినా... అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా...
* నూలు లోదుస్తుల్ని ఎంచుకోవాలి. అవి సౌకర్యాన్ని ఇవ్వడమే కాదు, వీటితో హానికారక బ్యాక్టీరియా, ఈస్ట్‌ వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు. వాటిని గోరువెచ్చని నీటితోనే ఉతికి ఆరేయాలి. వర్షాకాలంలో అయితే రోజులో రెండుసార్లు    లో దుస్తుల్ని మార్చుకోవడం మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి కానీ... సబ్బు వాడకూడదు. బిగుతుగా ఉన్న ప్యాంట్లూ వేసుకోకూడదు.
* నెలసరి సమయంలో... మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మూడు   గంటలకోసారి ప్యాడ్‌లను మార్చుకోవాలి. అప్పుడే చర్మం రాపిడికి గురికాదు.
* ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు కొన్నిసార్లు దుర్వాసన సమస్య ఎదురవుతుంది. దాన్ని నివారించేందుకు పరిమళాలున్న డియోడరంట్‌ వాడటం సరికాదు. దాంతో సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.


మరిన్ని