close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్లాస్టిక్‌ను ఎందుకు?

పర్యావరణ పరిరక్షణ మన ఇంటినుంచే మొదలుకావాలి. దానికోసం మనవంతుగా ఏం చేయొచ్చంటే...
* ఒకప్పుడు గాజు నీళ్ల సీసాలు వాడేవాళ్లం. ఇప్పుడవి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్లాస్టిక్‌ సీసాల బదులు వాటిని ఎంచుకుని చూడండి. ఆరోగ్యానికి మంచిది. పర్యావరణానికి ఉడతాభక్తిగా సాయం చేసిన వారవుతారు.
* భూమిలో కరిగిపోయే బ్యాగులను అమ్ముతున్నారిప్పుడు. అలాంటివి రెండుమూడు కొనిపెట్టుకుంటే... ప్లాస్టిక్‌ కవర్ల వాడకానికి చుక్కపెట్టొచ్చు.
* రోజూ వాడే ప్లాస్టిక్‌ టూత్‌బ్రష్‌లకు బదులుగా వెదురుతో చేసిన వాటిని ఎంచుకోండి. ఎక్కువ కాలం మన్నడమే కాకుండా  భూమిలోనూ కలిసిపోతాయి.
 


మరిన్ని