close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చెదరనివ్వకుండా... చమక్కుమనేలా!

చిన్నచిన్న వేడుకలకు మేకప్‌ వేసుకోవడం ఈ రోజుల్లో మామూలే.  మరి చినుకులు పడుతున్నప్పుడు చేసుకునే అలంకరణ చెదిరిపోకుండా ఉండాలంటే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

ఈ కాలంలో ఎంత తక్కువ మేకప్‌ వేసుకుంటే అంత మంచిదంటారు నిపుణులు.
* ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరైనా... దీన్ని చాలా తక్కువ మొత్తంలో ఉపయోగించాలి. ఫౌండేషన్‌ ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండాలంటే దాంతోపాటు బీబీ క్రీమ్‌నూ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. కాంపాక్ట్‌ లేదా పౌడర్‌నీ వీలైనంత కొద్దిగానే వాడాలి. బ్లష్‌ వాడుతుంటే... పౌడర్‌ రకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
* చినుకులు పడుతున్నప్పుడు ఐ లైనర్‌, కాజల్‌ వాడకపోవడమే ఉత్తమం. మస్కారా తప్పనిసరి అనుకుంటే వాటర్‌ప్రూఫ్‌ రకాన్ని ఎంచుకుని చూడండి. ఒక కోటింగ్‌ మాత్రమే వేసుకుంటే చాలు.
* పెదాలకు ఈ కాలంలో ఏదో ఒక లిప్‌స్టిక్‌ కాకుండా... న్యూడ్‌ రంగుల్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకుంటేనే మ్యాటీ లిప్‌స్టిక్‌ వేసుకోవాలి. ముఖ్యంగా లేత రంగులు నప్పుతాయి.
* కనుబొమల్ని దిద్దుకోవడానికి ఐబ్రో పెన్సిల్‌ వాడకపోవడమే మంచిది. చినుకులు పడితే... అది చెదిరిపోయే అవకాశం ఎక్కువ. చర్మం జిడ్డుగా ఉన్నా సరే... ఎప్పటికప్పుడు నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరి.


మరిన్ని