close

తాజా వార్తలు

వరద బాధితుల కోసం.. ఈ సైకత శిల్పం

దిల్లీ: దేశంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటూ వెళ్లలేని స్థితిలో సాయం కోసం వేచి చూస్తున్నారు. పలు చోట్ల వరద ధాటికి మొసళ్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 
వరదల కారణంగా కేరళ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల్లో 200మందికి పైగా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, అస్సోం తదితర రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్‌ పట్నాయక్‌ ట్విటర్‌ ద్వారా ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. వరద బాధితులకు సాయం చేయాలంటూ పూరీ తీరంలో ఇలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు