close

తాజా వార్తలు

ఓలా చేతికి పికప్‌.ఏఐ

న్యూదిల్లీ : క్యాబ్‌ సేవల దిగ్గజం ఓలా చేతికి పికప్‌.ఏఐ వచ్చింది. కృత్రిమ మేధ సేవలను అందించే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను ఇందర్‌ సింగ్‌, రిత్విక్‌ శిఖలు ప్రారంభించారు. ఈ కొత్త డీల్ ప్రకారం పికప్‌ బృందం ఓలాలో చేరనుంది. భవిష్యత్తులో ఓలాను మరింత అభివృద్ధి చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఓలా మిషిన్‌  లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, కృత్రిమ మేధ వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడంలో ఇది కూడా ఒక భాగమన్నారు. 
ఈ ఏడాది ప్రారంభంలో శాన్‌ఫ్రాన్సిస్కో బేలో ఒక అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఓలా ప్రకటించింది. ‘దాదాపు వంద కోట్ల మందికి ప్రయాణ సౌకర్యాలను కల్పించే అంశంలో ఓలా ముందడుగు వేసింది. మేము భవిష్యత్తు తరం సాంకేతికతలపై దృష్టిపెడుతున్నాం. పికప్‌.ఏఐ బృందాన్ని ఆహ్వానించేందుకు చాలా ఆతృతతో ఉన్నాము. మేము సంయుక్తంగా సృజనాత్మకంగా సాంకేతికతలను తయారు చేస్తున్నాం.’ అని ఓలా సీటీవో అంకిత్‌ భాతి తెలిపారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు