close

తాజా వార్తలు

‘సాహో’ ఆట.. పబ్జీని మించేలా!

ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో త్వరలో గేమ్‌ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. ‘డార్లింగ్స్‌.. ఇదిగో ‘సాహో’ ట్రైలర్‌. జెట్‌ ప్యాక్స్‌ ధరించి ‘సాహో’ ప్రపంచంలోకి వెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ గేమ్‌ను చాలా స్టైలిష్‌గా రూపొందించారు. యువతను ఉర్రూతలూగిస్తున్న పబ్జీ ఆటను మించిపోయేలా ‘సాహో’ గేమ్‌ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు