close

తాజా వార్తలు

కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌: మరోసారి భారత్‌×పాక్‌!

మెల్‌బోర్న్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ మళ్లీ భాగమైంది. బర్మింగ్‌హామ్‌లో నిర్వహించే 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20ని చేర్చారు. ఐసీసీ, కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన సీడబ్ల్యూజీలో తొలిసారి క్రికెట్‌ను చేర్చారు. దక్షిణాఫ్రికా అప్పుడు అగ్రస్థానంలో నిలిచింది.

బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు 2022 జులై 27 నుంచి ఆగస్టు 7 వరకు జరుగుతాయి. ఎనిమిది క్రికెట్‌ జట్లు ఇందులో పాల్గొంటాయి. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య రసవత్తర సమరాలకు అవకాశం ఉంది. ‘ఈ రోజు చరిత్రాత్మకం. కామన్వెల్త్‌ క్రీడల్లోకి మళ్లీ క్రికెట్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం’ అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు డేమ్‌ లూయిస్‌ మార్టిన్‌ అన్నారు. కామన్వెల్త్‌లో క్రికెట్‌ చేర్చడాన్ని ఐసీసీ, ఈసీబీ స్వాగతించాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారమే కామన్వెల్త్‌ క్రికెట్‌ నిర్వహిస్తారు. అన్ని మ్యాచ్‌లకు ఎడ్జ్‌బాస్టన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మధ్యే ముగిసిన పురుషుల వన్డే ప్రపంచకప్‌లో అక్కడ మరపురాని మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్‌ చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు అని నిర్వాహకులు చెబుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు