close

తాజా వార్తలు

వాళ్లు ఒప్పుకోరు.. కానీ మేం నటించాలి

హీరోలను ఉద్దేశిస్తూ తాప్సి

ముంబయి: మహిళా నేపథ్యంతో తెరకెక్కే సినిమాల్లో స్టార్‌ హీరోలు నటించడానికి ఒప్పుకోరని అభిప్రాయపడుతున్నారు సినీ నటి తాప్సి. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా పారితోషికం గురించి, మహిళా నేపథ్యం ఉన్న సినిమాల గురించి తాప్సి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

‘నాకు వస్తున్న పాత్రలు, పారితోషికం విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ హీరో, హీరోయిన్లకు మధ్య ఉన్న పారితోషికంలోని వ్యత్యాసం నన్ను బాధిస్తోంది. ఈరోజుల్లో ఓ మహిళా నేపథ్యంతో తెరకెక్కే సినిమాకు పెట్టే బడ్జెట్‌ హీరో పారితోషికంతో సమానంగా ఉంటోంది. ఇలాంటి సినిమాల్లో కూడా నన్ను పారితోషికం తగ్గించుకోవాలని అడుగుతుంటారు. అదేంటని అడిగితే.. ఇది మహిళా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కదా మేడమ్‌.. అంటుంటారు. సినిమాలో హీరోయిన్‌ది ప్రధాన పాత్ర అయితే ఏ స్టార్‌ హీరో జంటగా నటించడానికి ఒప్పుకోడు. కానీ స్టార్‌ హీరో పక్కన కాసేపు కన్పించడానికి మాత్రం హీరోయిన్లు ఒప్పుకోవాలి. ఇలాంటి విషయాలు నన్ను చాలా బాధిస్తుంటాయి’ అని వెల్లడించారు తాప్సి. అక్షయ్‌ కుమార్‌, నిత్యామేనన్‌, విద్యా బాలన్‌, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు