close

తాజా వార్తలు

తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించా

వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడి వ్యాఖ్య

చెన్నై: ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడు విమల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘కాన్ని రాశి’. ముత్తుకుమారన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి, విమల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావించారు. 

‘నేనే ప్రేమ వివాహం చేసుకుంటానా?పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అన్న విషయం పక్కన పెడితే నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు’ అన్నారు. అనంతరం విమల్‌ మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించాను’ అనేశారు. ఆ తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ.. ‘అంటే నా ఉద్దేశం అది కాదు. ఆమెతో కలిసి పనిచేయడంలో నేను ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్‌ అవగానే తన పాత్రలో లీనమైపోతారు’ అని వెల్లడించారు విమల్‌.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు