close

తాజా వార్తలు

18 రోజులవుతోంది.. ప్రభుత్వాన్ని రద్దు చేయండి

గవర్నర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించిన కాంగ్రెస్‌

బెంగళూరు: కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ముగిసి యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టి 18 రోజులు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆ పార్టీ ప్రశ్నించింది. ఆయన వెంటనే స్పందించి యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేసింది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించాల్సిన గవర్నర్‌ మౌనంగా ఉండటం ఏంటని కాంగ్రెస్‌ నేత వి.ఎస్‌.ఉగ్రప్ప మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జులై 26న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ చేయలేదని.. పరిపాలనా బాధ్యతలు ఒక్కరే నిర్వర్తిస్తున్నారని ఉగ్రప్ప విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక్కరే ప్రభుత్వం కాదంటూ యడియూరప్పపై మండిపడ్డారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరిగి ఉంటే.. భారీ వరదలతో అతలాకుతలమైన రాష్ట్రంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండేదని ధ్వజమెత్తారు. మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని..  మొదటి దశలో 10 నుంచి 12 మందిని మంత్రివర్గంలోకి  తీసుకునే అవకాశాలున్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు