close

తాజా వార్తలు

మూడు చెట్లు నరికి..రూ.39వేల జరిమానా కట్టి..

హైదరాబాద్‌: అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా చెట్లు అడ్డంపడుతున్నాయంటూ భవనం యజమాని మూడు చెట్లను అడ్డంగా నరికించేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్టు తేలడంతో గత నెల 7న ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. దీంతో ఆయన ఈ నెల 9న జరిమానా చెల్లించారు. 

నగరంలో చెట్ల పెంపకానికి సంబంధించి జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇందుకోసం నిధులు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో చెట్లు క్రమంగా తగ్గిపోతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో అధికారులు కఠిన చట్టాలను అమలుచేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు