close

తాజా వార్తలు

నియంత్రణ రేఖ వద్ద పాక్‌ తీరు సరికాదు!

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

దిల్లీ: జమ్ము కశ్మీర్‌ ప్రజలతో తాము స్నేహభావం కోరుకుంటున్నామని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. 1970, 80ల నాటి బంధాలు మళ్లీ పునరావృతం కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘‘నియంత్రణ రేఖ వద్ద మోహరించాలనుకోవడం పాక్‌ ఇష్టం. ముందస్తుగా ఎవరైనా అలా చేసుకోవచ్చు. ఈ పరిణామంతో మనం మరీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ ఆర్మీ పరంగా మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.’’ అని వ్యాఖ్యానించారు.
లద్దాఖ్‌ సమీపంలోని తమ క్యాంపుల వద్దకు పాకిస్థాన్‌ విమానాలను తరలిస్తున్న సంగతి తెలిసిందే. నిఘావర్గాల హెచ్చరికల మేరకు భారత వైమానిక దళం, ఆర్మీ పాక్‌ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. 
సోమవారం కశ్మీర్‌లో పటిష్ఠమైన భద్రత నడుమ బక్రీద్‌ పండుగ ప్రశాంతంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రజలతో కలిసి మిఠాయిలు పంచుకోవడం కనిపించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు