close

తాజా వార్తలు

సోదరితో బుమ్రా ముందస్తు రాఖీ వేడుక

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు ఆటగాడు జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు రోజుల ముందుగానే తన సోదరితో కలసి రాఖీ పండగను జరుపుకొన్నాడు. వెస్టిండీస్‌తో ఆగస్టు 22న ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌ సిరీస్‌కు ప్రయాణం కానుండడంతో ముందుగానే తన సోదరితో రాఖీ కట్టించుకున్నట్లు ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు. ‘జుహిక(బుమ్రా సోదరి).. నేను ఈ రాఖీ పండగకు ఇక్కడ ఉండలేకపోవచ్చు.. అయినా నీతో రాఖీ కట్టించుకునే అవకాశాన్ని నేను వదులుకోలేను. ఎల్లప్పుడు నా సోదరిగా నాకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అంటూ బుమ్రా ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
టీమిండియా, విండీస్‌ జట్ల మధ్య ఆగస్టు 22 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17 నుంచి 19 వరకు ఇరు జట్లు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. 2019 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత పనిభారం కారణంగా బుమ్రాకు విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు