close

తాజా వార్తలు

ఆగస్టు 15ను ‘రిపబ్లిక్‌ డే’గా ప్రచురించారు!

దిల్లీ పోలీసు విభాగం నిర్వాకం

దిల్లీ: దిల్లీ పోలీసు విభాగం ఆగస్టు 15ను ‘రిపబ్లిక్ డే’గా ప్రచురించి విమర్శలు మూటగట్టుకుంది. ఈ వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ కూడా దాఖలైందని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఆగస్టు 15కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన దక్షిణ దిల్లీ పోలీసు విభాగం, అందులో ‘ఇండిపెండెన్స్‌ డే’కు బదులుగా ‘రిపబ్లిక్‌ డే’ అని తప్పుగా ప్రచురించింది. దీంతో మన్‌జీత్‌ సింగ్‌ చుఘ్‌ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పుల నోటిఫికేషన్లను పై అధికారులు పరిశీలించి ఆమోదించలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.
ఇలాంటి వివాదాస్పద ఘటన 2016లో ఓ సారి జరిగింది. చండీగఢ్‌కు చెందిన భాజపా విభాగం ఆగస్టు 15 సందర్భంగా గణతంత్ర దినోత్సవం అని ఓ చోట పేర్కొంది.
1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తేదీ ఆగస్టు 15ను ‘ఇండిపెండెన్స్‌ డే (స్వాతంత్ర్య దినోత్సవం)’అని, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26ను ‘రిపబ్లిక్‌ డే (గణతంత్ర దినోత్సవం)’గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు