close

తాజా వార్తలు

ఆ సినిమా నుంచి తప్పుకొనే ప్రసక్తేలేదు: కాజల్‌

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ ‘భారతీయుడు 2’ సినిమా నుంచి తప్పుకోనని అగ్ర కథానాయిక కాజల్‌ చెప్పారు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌కు జోడీగా ఆమె నటిస్తున్న చిత్రమిది. శంకర్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 1996 హిట్‌ ‘భారతీయుడు’కు సీక్వెల్‌ ఇది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. ఇటీవల ఆమె సెట్‌లో అడుగుపెట్టారు. కాగా ఈ ప్రాజెక్టు నుంచి కాజల్‌ తప్పుకొన్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా కాజల్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కమల్‌ సినిమా నుంచి వైదొలగనని చెప్పారు.

అనంతరం తన తర్వాతి సినిమా ‘రణరంగం’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మొత్తం నేను కనిపిస్తానని మీరు ఆశించొద్దు. సినిమాలోని ఓ పాత్ర మాత్రమే నాది. దానికి కథలో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దర్శకుడు సుధీర్‌ వర్మ నాకు కథ చెబుతున్నప్పుడు నా పాత్రపై చాలా స్పష్టత ఏర్పడింది. ఈ సినిమాలో నేను నటించాలనే ఉద్దేశంతో ఒప్పుకొన్నాను’ అని ఆమె అన్నారు. ‘రణరంగం’లో శర్వానంద్‌ కథానాయకుడిగా నటించారు. కల్యాణి ప్రియదర్శన్‌ మరో కథానాయిక. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు