close

ఫీచర్ పేజీలు

స్మార్ట్‌ఫోనే ‘కీ’ కార్డు

సంగారెడ్డి.. చర్లపల్లి.. చంచల్‌గూడ.. అక్కడి కారాగారాల్లోని గోడలపై కొన్ని చిత్రాలు ఆకట్టుకుంటాయి. శాంతిని ప్రబోధించే బుద్దుడు, చరఖాతో గాంధీజీ, వెన్న చిలికే యువతి, పల్లె సౌందర్యం.. ఇలా ప్రత్యేకత చాటుకునేవెన్నో. వీటిని ఎవరు చిత్రించారో తెలుసా? ఓ జీవిత ఖైదీ.. ఓ కేసులో శంకర్‌ అనే వ్యక్తికి 2016లో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తుండగా సంస్కరణలలో భాగంగా అతనిలోని చిత్ర కళా నైపుణ్యాన్ని అధికారులు గుర్తించి ప్రోత్సహించారు. అంతే జైలు గోడలపై శంకర్‌ కుంచె నాట్యమాడింది. రకరకాల బొమ్మలను గీసి అధికారుల మెప్పు పొందాడు. ఆ తర్వాత సంగారెడ్డి జైలులోనూ బుద్దుడు, గీతాచార్యుడు తదితర బొమ్మలు వేశాడు. ప్రస్తుతం చంచల్‌గూడ కారాగారంలోని బ్యారక్‌ల వద్ద, గోడలపై బొమ్మలు వేసేందుకు ఇక్కడికి తీసుకువచ్చారు. జైలు ముందు భాగం చక్కటి రంగులద్ది ఔరా అనిపించుకున్నాడు.

-చంచల్‌గూడ, న్యూస్‌టుడే

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు