close

వసుంధర

ప్రసవం తరువాత... తగ్గేలా

కొంతమందిలో ప్రసవం తరువాత పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఆ సమస్యని అదుపులో ఉంచాలంటే...

* గర్భం దాల్చినప్పుడు... ఈ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ కొవ్వు చేరుతుంది. ఎక్కువ గంటలు కూర్చోవడం, అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరగొచ్చు. ప్రసవం తరువాత బరువు తగ్గడం కొంచెం కష్టమైనా... ప్రయత్నిస్తే సాధ్యమే.
* అప్‌ డౌన్‌ స్టెప్‌... చిన్న  బల్లను తీసుకోవాలి. దీనిపై కనీసం ముప్పైసార్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నడుముభాగంలో కొవ్వు తగ్గుతుంది.
* స్క్వాట్స్‌... వీటితో తీరైన శరీరాకృతి సొంతమవుతుంది. ముందుగా నిటారుగా నిల్చోవాలి. కాళ్ల మధ్య అడుగు-అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. చేతులను ముందుకు చాచి గాల్లో కూర్చుంటున్నట్లుగా కిందకు కూర్చునే ప్రయత్నం చేస్తూ పైకి లేవాలి. ఇలా కనీసం అరవైసార్లు చేసేందుకు ప్రయత్నించాలి.
* సైక్లింగ్‌, నడక, ఈత... కొన్ని గంటలపాటు శరీరం చురుగ్గా ఉండాలంటే సైకిలు తొక్కాలి. నడిచినా, ఈత కొట్టినా బరువు తగ్గడం చాలా సులువవుతుంది.
* వ్యాయామంతోపాటు... ఆహారంపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చటి నీరు తాగాలి. టీకి బదులుగా గ్రీన్‌/లెమన్‌ టీ తీసుకోవాలి. ఎల్లప్పుడూ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు