close

వసుంధర

రాఖీ చేసేద్దాం!

రవ్వల

పండగ నాడు సోదరుడికి రాఖీ కట్టడం అందరూ చేసేదే! ఆ రాఖీని కొనడం కన్నా... దాన్ని మీరే అందంగా ఎందుకు తయారు చేయకూడదు.  ఆ ఆలోచన ఉంటే... ఇలా చేసేందుకు ప్రయత్నించండి.

కావాల్సినవి: మీరు చేయాలనుకున్న డిజైనుకి తగ్గట్లుగా పూసలు, అద్దాలు, స్టోన్స్‌, స్టిక్కర్లు తెచ్చిపెట్టుకోవాలి. చేతికి కట్టుకునే తాడు కోసం బంగారు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సిల్క్‌ దారం ఎంచుకుంటే బాగుంటుంది. నచ్చిన రంగులో ఊలు దారం ఉండ... పూసల్ని అతికించడానికి గ్లూ, కత్తెర అవసరం.

* తయారీ విధానం 1 : ఈ పద్ధతిలో ఊలుని చేతి వేళ్లకు పది వరుసలు వచ్చేలా చుట్టు తిప్పాలి. దీన్ని దారంతో మధ్యకు ముడివేసి రెండు చివర్లూ కత్తిరించుకోవాలి. అందంగా సర్దితే చక్కటి పువ్వులా తయారవుతుంది. దాని మధ్య గుండ్రటి పూస లేదా స్టోన్‌ అతికించి అడుగు నుంచి మరో రంగు దారం కడితే రాఖీ తయారవుతుంది.

చూద్దాం-చేద్దాం

* తయారీ విధానం 2: కార్డ్‌బోర్డ్‌ని చేతి పరిమాణానికి తగ్గట్లు గుండ్రంగా కత్తిరించుకోవాలి. దాని మధ్యలో గుండ్రటి ముదురు రంగు స్టోన్‌ అతికించి... చుట్టూ ముత్యాలను పేర్చాలి. అడుగు నుంచి సిల్క్‌ దారాన్ని చేతికి కట్టుకునేలా జతచేస్తే చాలు.
* తయారీ విధానం 3: బంగారు రంగు దారాన్ని కావాల్సిన పొడవులో తీసుకోవాలి. దీని మధ్యకి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు పూసను ఎక్కించాలి. అది కదలకుండా చిన్న పరిమాణంలో మరో రెండు బంగారు రంగు పూసల్ని చేర్చాలి. ఒక్కో ముత్యాన్ని తీసుకుని చెరో వైపు జత చేయాలి. చివరిగా మరో రంగు పూస ఉంచి ముడి వేస్తే అందమైన రాఖీ సిద్ధమైనట్లే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు