close

ఫీచర్ పేజీలు

ముందు 32.. వెనక 4

శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఓ బాలుడి వెన్నెముకలో ఇరుక్కున్న పెన్సిల్‌ ముక్కను శస్త్ర చికిత్స చేసి వైద్యులు విజయవంతంగా తొలగించారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేటకు చెందిన శివకుమార్‌, లావణ్య దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్‌(11) ఆరో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం తోటి పిల్లలతో ఆడుకుంటూ పక్కనే ఉన్న మరో బాలుడిపై తూలిపడ్డాడు. బాలుడు చేతిలో ఉన్న పెన్సిల్‌ మనోజ్‌కు వెన్నెముక కింది భాగంలో గుచ్చుకుంది. దాదాపు మూడు అంగుళాల లోపలికి వెళ్లి విరిగింది. రక్తం ఎక్కువ రాకపోవడంతో పెన్సిల్‌ ముల్లు మాత్రమే విరిగి ఉంటుందని భావించారు. తల్లిదండ్రులకూ విషయం చెప్పలేదు. నాలుగైదు రోజుల నుంచి వెన్నెముక గాయం తీవ్రమైంది. బాధతో విలవిలలాడుతుండటం చూసి తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిసింది. బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డాక్టర్‌ శివారెడ్డి, వంశీమోహన్‌ సూచనతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు. వెన్నెముకలో 3అంగుళాల పెన్సిల్‌ ముక్క ఉన్నట్లు తేలింది. రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్‌ చేసి పెన్సిల్‌ను తొలగించారు. బాలుడు కోలుకోవడంతో బుధవారం డిశ్ఛార్జి చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు