close

ఫీచర్ పేజీలు

ముందు 32.. వెనక 4

మొబైల్‌ మాయ

ధర రూ.17990

నేటితరం మొబైల్‌ ప్రియులంతా సెల్ఫీ ప్రియులే. అందుకే వివో ఏకంగా 32 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో సెల్ఫీ కెమెరాని నిక్షిప్తం చేసి కొత్త మోడల్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. పేరు వివో ఎస్‌1. తాకేతెర పరిమాణం 6.38 అంగుళాలు. వెనక  మూడు కెమెరాలు (16ఎంపీ+8ఎంపీ+2ఎంపీ). తెర వెనకే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ (ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌) ఉండటం మరో ప్రత్యేకత. రెండు వేరియంట్స్‌లో ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది (4జీబీ ర్యామ్‌+ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 6జీబీ ర్యామ్‌+ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ). ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో పనిచేస్తుంది. 4500ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం.

ఫోన్‌తోనే ఇంచుమించు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా మాదిరిగా ఫొటోగ్రఫీ చేయాలనుకుంటున్నారా? అయితే, రియల్‌మి ప్రవేశపెట్టనున్న ‘5-సిరీస్‌’ స్మార్ట్‌ ఫోన్‌పై ఓ కన్నేయండి. వెనక నాలుగు కెమెరాల్ని (క్వాడ్‌ కెమెరా) ఏర్పాటు చేశారు. ప్రైమరీ కెమెరా లెన్స్‌తో పాటు అదనంగా మరో మూడు లెన్స్‌ని జత చేశారు. దీంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫొటోలు తీయొచ్చు. వైడ్‌ యాంగిల్‌లోనూ చిత్రీకరణ చేయొచ్చు. అంతేకాదు.. దూరంగా ఉన్నవాటిని జూమ్‌ చేసేందుకు జూమింగ్‌ లెన్స్‌ వాడొచ్చు. ఈ నెలలోనే ఆన్‌లైన్‌ అంగళ్లలోకి రానుంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు