close

ఫీచర్ పేజీలు

మీ డేటా చిక్కదు.. దొరకదు

ఇన్‌క్రిప్షన్‌ టూల్స్‌

ఇంట్లో కావచ్చు.. ఆఫీస్‌లో అయ్యుండొచ్చు.. బిజినెస్‌ ల్యాపీలోగానీ.. స్టూడెంట్‌ పీసీలోగానీ.. వాడే కంప్యూటర్‌ ఏదైనా ముఖ్యమైన డేటాని సేవ్‌ చేస్తుంటాం.. ఎంత కట్టుదిట్టంగా యాంటీవైరస్‌లు, ఫైర్‌వాల్స్‌ని వాడినప్పటికీ డేటాకి భద్రత లేకుండా పోతోంది. హ్యాకర్లు ప్రయోగిస్తున్న వైరస్‌ ట్రిక్కులు రోజు రోజుకీ మరింత స్మార్ట్‌ అయిపోతున్నాయి. అలాంటప్పుడు సిస్టంలో భద్రం చేసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని ఇతరుల కంట పడకుండా చేయాలంటే? ఫైల్స్‌ని అర్థం కాకుండా మార్చేయడమే. అంటే.. ఇన్‌క్రిప్షన్‌లో కోడ్‌ని మార్చేయడం. అదెలాగంటే.. కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. అన్నీ ఉచితమే.

ఫైల్‌, ఫోల్డర్‌ ఏదైనా..
*ఇన్‌క్రిప్టో

సిస్టంలో జీబీల్లో డేటా ఉన్నప్పటికీ ఏవో కొన్నే ముఖ్యమైనవి ఉంటాయి.. అవి ఎవరి కంటా పడొద్దు అనుకుంటాం. అలాంటి డేటాని ఇన్‌క్రిప్షన్‌ మోడ్‌లోకి మార్చుకునేందుకు ఇన్‌క్రిప్టోని వాడుకోవచ్చు. సులువైన పద్ధతిలో ఫైల్స్‌, ఫోల్డర్లను పాస్‌వర్డ్‌తో ఇన్‌క్రిప్ట్‌ చేయొచ్చు. ఒక్కసారి ఇన్‌క్రిప్ట్‌ చేసిన ఫైల్‌ని తిరిగి డీక్రిప్ట్‌ చేస్తేగానీ ఓపెన్‌ చేయడం సాధ్యం కాదు. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఎంపిక చేయొచ్చు. ‘యాడ్‌ ఫైల్‌, యాడ్‌ ఫోల్డర్‌’ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇలా ఇన్‌క్రిప్ట్‌ చేసిన ఫైల్స్‌ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఇతరులకు షేర్‌ చేయవచ్చు. విండోస్‌, మ్యాక్‌ యూజర్లు టూల్‌ని వాడుకోవచ్చు. పాస్‌వర్డ్‌ మర్చిపోకుండా ఉండేందుకు ‘హింట్‌’ పెట్టుకునే వీలుంది.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http:t.ly/2OQ5Qqt

ప్రత్యేక అడ్డానే..
* క్రిప్టోమాటర్‌

అన్ని స్టోరేజ్‌ డ్రైవ్‌ల మాదిరిగానే ముఖ్యమైన ఫైల్స్‌కి ఇన్‌క్రిప్షన్‌ మోడ్‌లో ప్రత్యేక లాకర్‌ని క్రియేట్‌ చేసుకునేందుకు ఇదో చక్కని అప్లికేషన్‌. ఇన్‌స్టాల్‌ చేసుకుని వచ్చిన విండోలోని ‘ప్లస్‌’ గుర్తుని సెలెక్ట్‌ చేసి ఎన్‌క్రిప్షన్స్‌ డేటా కోసం ప్రత్యేక ‘వాల్ట్‌’ని క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత వాల్ట్‌కి పాస్‌వర్డ్‌ని పెట్టుకోవాలి. సిస్టంలోని ముఖ్యమైన ఫైల్స్‌ అన్నింటినీ వాల్ట్‌లోకి కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఇక ఎప్పుడైనా వాల్ట్‌ని ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయాల్సిందే. మరి, ఇన్‌క్రిప్ట్‌ అయిన ఫైల్స్‌ ఎక్కడ సేవ్‌ అవుతాయ్‌? క్లౌడ్‌ స్టోరేజ్‌లో! గూగూల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌లను సపోర్టు చేస్తుంది. యాప్‌ రూపంలో ఫోన్‌లోనూ ఇన్‌స్టాల్‌ చేసుకుని ముఖ్యమైన డేటాని సురక్షితం చేసుకోవచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http:t.ly/2P1oax4


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు